టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రేమను పెద్దగా మాటల్లో చెప్పకపోయినా.. చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో తమ అనుబంధాన్ని చాటుకునే ఈ జంట లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సందడి చేసింది. భర్త నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత షేర్ చేసిన రొమాంటిక్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లిప్ కిస్ ఫొటో చూసిన అభిమానులు ఈ జంట కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు.
నవంబర్ 23న నాగచైతన్య తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్య శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. సైప్రస్ వెకేషన్‌లో వీరిద్దరూ కలిసి గడిపిన అందమైన క్షణాలను అభిమానులతో షేర్ చేశారు. ఓ ఫొటోలో నాగచైతన్యకు శోభిత ముద్దు పెడుతూ కనిపించగా.. మరో ఫొటోలో ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని రొమాంటిక్‌గా పోజులిచ్చారు. అంతేకాదు, నాగచైతన్య సరదాగా కనిపించే ఓ ఫన్నీ వీడియోను కూడా జత చేశారు.
ఈ ఫొటోలకు 'హ్యాపీ బర్త్‌డే లవర్' అంటూ కేవలం మూడు పదాలతో క్యాప్షన్ ఇచ్చారు శోభిత. ఈ చిన్న మెసేజ్‌లోనే భర్తపై తనకున్న ప్రేమను అందంగా వ్యక్తం చేశారు. మరో వైపు హీరో విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు.. నాగచైతన్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. ఎల్లప్పుడూ నీకు అంతలేని ఆనందం.. మంచి ఆరోగ్యం, అపారమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నట్లు చైతూతో దిగిన ఫోటోను షేర్ చేశారు.
Happy birthday Chay! Sending my biggest, brightest wishes your way. Wishing you endless happiness, good health and so much love, today and always. @chay_akkineni ❤️❤️✨ https://t.co/Kh86uDt7dI
— Venkatesh Daggubati (@VenkyMama) November 23, 2026
అటు అభిమానులు కూడా కామెంట్లతో చైతుకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు కేరళకు చెందిన ప్రముఖ మ్యూరల్,వాల్ ఆర్టిస్ట్ రషీద్ సులైమాన్.. నాగచైతన్య ఆర్ట్ ను గోడపై గీసి తన అభిమానాన్ని చాటుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు.
ALSO READ : రాజకీయాల్లోకి త్రిష కృష్ణన్? జయలలిత తరహా బిరుదుతో కొత్త సంస్థ ఏర్పాటు!
నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ'తో బిజీగా ఉన్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ డిసెంబర్ 4, 2026న విడుదల కానుంది. పెళ్లి రోజునే సినిమా విడుదల కావడం కూడా విశేషం..
