గ్లోబల్ పీస్ హానర్స్ ఈవెంట్ లో షారుఖ్ కి అనంత్ అంబానీ వార్నింగ్... వీడియో వైరల్..!

గ్లోబల్ పీస్ హానర్స్ ఈవెంట్ లో షారుఖ్ కి అనంత్ అంబానీ వార్నింగ్... వీడియో వైరల్..!

ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా శనివారం ( నవంబర్ 21 ) రాత్రి జరిగిన 'గ్లోబల్ పీస్ హానర్స్ 2026' కార్యక్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను అనంత్ అంబానీ వారించినట్లు ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నవంబర్ 21న నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రధానంగా 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులకు నివాళులర్పించేందుకు ఉద్దేశించింది. దేశ భద్రత కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రాణాలను పణంగా పెట్టే రక్షణ సిబ్బంది సేవలను గుర్తించి, వారిని గౌరవించడం ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఆధ్యాత్మిక గురువు సద్గురుతో పాటు అనంత్ అంబానీ కూడా పాల్గొన్నారు.

ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, విక్రాంత్ మాస్సే వంటి ప్రముఖ నటులు హాజరయ్యారు. అతిథులు వేదికపైకి వచ్చి నివాళులర్పిస్తున్న సమయంలో ఒక ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో.. వేదికపై సద్గురుతో అనంత్ అంబానీ మాట్లాడుతుండగా షారుఖ్ ఖాన్ వారి దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో షారుఖ్ కూడా నవ్వుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. అయితే, అనంత్ అంబానీ వెంటనే తన వేలిని నోటిపై ఉంచి షారుఖ్‌ను మాట్లాడవద్దని సైగ చేస్తూ వారించారు. బహిరంగంగానే ఆయనను వారించడంతో షారుఖ్ ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంత అసౌకర్యంగా అనిపించినా, వెంటనే ఆయన సర్దుకుని చిరునవ్వుతో అక్కడే ఉన్నవారితో మాట్లాడటం ప్రారంభించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, పారిశ్రామిక శక్తి ముందు సినిమా సెలబ్రిటీల హోదా సరిపోదని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. "నిజమైన సంపద, పవర్ మాట్లాడేటప్పుడు స్టార్ హీరోలు కూడా ఏమీ చేయలేరని ఈ ఘటన నిరూపిస్తోంది" మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరో పక్క అనంత్ అంబానీ ప్రవర్తనపై విమర్శలు కూడా వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ వంటి సీనియర్ నటుడి పట్ల అనంత్ అట్లా ప్రవర్తించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఏవైనా, గౌరవం అనేది ఇరువైపులా ఉండాలని... షారుఖ్ ఖాన్ తన స్వయంకృషితో, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నారని... ఆయనను అట్లా వేలు చూపించి వారించడం పద్ధతి కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.