దేశంలోని కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో సత్వర న్యాయం లభించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం అవసరం అన్నారు సుప్రీంకోర్టు జడ్జి జయమల్య బాగ్చి. అన్ని కేసుల్లోనూ తీర్పు అనేది ఏఐతో సాధ్యం కాదని.. కొన్ని కేసుల్లో AI ఆధారంగా త్వరగా తీర్పులు వెల్లడించొచ్చు అన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐ ఆధారంగా 24 గంటలూ.. 7 రోజులూ పని చేసే విడాకుల కోర్టులు రావాలని అభిప్రాయపడ్డారాయన. 2026, నవంబర్ 21వ తేదీన జబల్ పూర్ లోని ధర్మశాస్త్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన జస్ట్ టెక్క అనే జాతీయ సదస్సులో మాట్టాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ జయమాల్య బాగ్చి.
దేశంలోని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కోట్లాది పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు.. పరస్పర అంగీకారంతో కూడిన విడాకుల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 24/7 పనిచేసే ఏఐ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి ప్రతిపాదించారు. నవంబర్ 21, 2026న జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన 'జస్ట్ టెక్ నేషనల్ కాన్క్లేవ్'లో మాట్లాడుతూ ఈ కీలక సూచనలు చేశారు.
భారత న్యాయవ్యవస్థలో ప్రస్తుతం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ బాగ్చి గుర్తుచేశారు. సాధారణ, ఊహించదగిన ప్రక్రియలతో కూడిన పరస్పర అంగీకార విడాకుల కేసులను సాధారణ న్యాయమూర్తుల పనిభారం నుంచి వేరు చేసి.. వారంలో 7 రోజులు, 24 గంటల పాటు పనిచేసే ఏఐ కోర్టులకు అప్పగించాలని సూచించారు. దీనివల్ల న్యాయమూర్తులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, వేగంగా న్యాయం అందుతుందని అభిప్రాయపడ్డారు.
విడాకుల కేసులతో పాటు ముందస్తు విచారణ అభ్యర్థనలు, అఫిడవిట్ల దాఖలు, గడువు పొడిగింపు వంటి సాధారణ కోర్టు పనులను కూడా ఏఐ ద్వారా నిర్వహించవచ్చన్నారు. అంతేకాకుండా చెక్ బౌన్స్, భూసేకరణ, డబ్బు రికవరీకి సంబంధించిన వాణిజ్య వివాదాల్లో పత్రాలను విశ్లేషించి, కేసు ఫలితాలను ముందే అంచనా వేసే ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
అయితే ఏఐ ఎప్పటికీ మానవ న్యాయమూర్తులకు ప్రత్యామ్నాయం కాదని జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలు, సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలతో కూడిన కీలక కేసులను మానవ న్యాయమూర్తులే విచారించాలని, ఏఐని కేవలం న్యాయవ్యవస్థ పనితీరును వేగవంతం చేసే ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు.
