రెక్కలు లేకుండానే గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..

రెక్కలు లేకుండానే గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..

Wingless Flying Car: కారు అంటే రోడ్డుపై నడిచేది.. విమానం, హెలికాఫ్టర్ అంటే గాల్లో ఎగిరేది అనే ముచ్చట ఇప్పటి వరకు ఇదే అందరికీ తెలిసిన సంగతి.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గాల్లో ఎగిరే కార్లు వచ్చేశాయి. మొన్నటికి మొన్న ఎలాన్ మాస్క్ ఫ్లయింగ్ కారు విడుదల చేసిన తర్వాత.. పోటా పోటీగా చైనా తన ప్రయోగాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. రెక్కలు లేకుండా గాల్లో ఎగిరే విమానం ప్రయోగం సక్సెస్ అయినట్లు చైనా ప్రకటించింది. ఆటోమొబైల్ రంగంలోనే ఇది అద్భుత ఆవిష్కరణగా ప్రపంచం నోరెళ్లబెతుంది. రెక్కలు లేని ఈ ఫ్లయింగ్ కారు విశేషాలని మీరు V6 వెలుగు వెబ్ సైట్ లో చూడండి..

ఫ్లయింగ్ కార్ ప్రయోగం సక్సెస్: 

చైనా దేశం హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో 2026, నవంబర్ 20వ తేదీన ఫ్లయింగ్ కార్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. భూమికి 50 అడుగుల ఎత్తు వరకు ఈ కారు ఎగిరింది. రవాణా రంగంలో ఇది అద్భుతమైన మార్పులను తీసుకొస్తుందని ప్రకటించింది. మామూలుగా అయితే ఈ తరహా వాహనాలకు రెక్కలు ఉంటాయి.. ఈ ఎగిరే కారుకు రెక్కలు లేకపోవటం విశేషం. దీని డిజైన్ అద్భుతంగా ఉంది. సాధారణ కారు మాదిరిగానే కనిపిస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రవాణా వ్యవస్థలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన అడుగుగా టెక్ నిపుణులు భావిస్తున్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో చైనా దూకుడు: 

ఈ కారు రోడ్లపైనా తిరుగుతుంది. అవసరాన్ని బట్టి గాల్లో ఎగురుతుంది.. రెండు రకాలుగా పనికొస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. దీన్ని ప్రొటోటైప్ వెహికల్ గా టెక్నాలజీ భాషలో చెబుతున్నారు తయారుదారులు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించామని.. రోడ్డుపైన, గాల్లో ఒకేసారి ప్రయాణించే విధంగా దీని డిజైన్ చేశాం.. ఒక కారులో నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చని.. రవాణాకు సైతం ఇదే టెక్నాలజీతో.. కొత్త డిజైన్ లో వెహికిల్ తయారు చేస్తున్నట్లు ప్రకటించారు నిపుణులు.

దేశంలో ట్రాఫిక్ సమస్యకు చెక్: 

రాబోయే రోజుల్లో రోడ్లపై ప్రయాణానికి, గాల్లో రవాణాకు మధ్య ఉన్న తేడాను తగ్గించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని.. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఫ్లయింగ్ కారు చెక్ పెడుతోందని తయారు చేసిన ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ప్రోటోటైప్ కారు విజయవంతంగా గాలిలోకి ఎగిరినప్పటికీ.. దీనికి సంబంధించిన టెక్నాలజీ.. ఎలా తయారు చేశారు అనే వివరాలు వెల్లడించలేదు ఇంజినీర్లు.
ఇదే సమయంలో ఇది రోడ్డుపై.. గాల్లో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది.. గాల్లో ఎగిరినప్పుడు ఎంత దూరం వెళుతుంది.. ఇది బ్యాటరీతో నడుస్తుందా లేక పెట్రోల్ లాంటి ఇంధనం కావాలా.. ఎంత ఎత్తు వరకు వెళుతుంది అనే పూర్తి వివరాలని ఇంకా వెల్లడించలేదు.

ఎగిరే కార్ల తయారీ కోసం దిగ్గజ కంపెనీల పోటీ: 

ఎగిరే కార్ల విభాగంలో చైనా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఇతర దిగ్గజ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కూడా ఇలాంటి సాంకేతికతపైనే పని చేస్తోంది. కొత్త తరం ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ‘రోడ్‌స్టర్’ను ఇటీవల పరీక్షీచింది. చైనా చేపట్టిన ఈ రెక్కలు లేని కారు ప్రయోగం ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, రవాణా రంగంలో కొత్త మార్పులకు సంకేతమని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని టెస్టులు పూర్తి చేసిన అనంతరం దీని పూర్తి స్థాయి సామర్థ్యంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.