భారత్ WTC ఫైనల్ ఆశలు ఆవిరి.. న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రా కావడానికి కారణం ఇదే!

భారత్ WTC ఫైనల్ ఆశలు ఆవిరి.. న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రా కావడానికి కారణం ఇదే!

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడం టీమిండియా (Team India) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) ఫైనల్ అవకాశాలకు గట్టి దెబ్బ కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 720/9 వద్ద డిక్లేర్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించినా, చివరి రోజు కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అడ్డుగోడలా నిలవడంతో ఇండియా కీలకమైన విజయపు పాయింట్లను కోల్పోయింది. ఐసీసీ విడుదల చేసిన తాజా WTC పాయింట్ల పట్టిక ప్రకారం భారత్ 4వ స్థానంలోనే కొనసాగుతుండగా, పాయింట్ల శాతం (PCT) మరింత తగ్గింది. 

WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులివే!

* వెల్లింగ్టన్ టెస్టు డ్రా ఫలితం పాయింట్ల పట్టికలో టాప్-2 సమీకరణాలను తలకిందులు చేసింది

* 4వ స్థానంలోనే భారత్ (PCT 50.00%): మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లకు చెరో 4 పాయింట్లు లభించాయి. దీంతో భారత్ పాయింట్ల శాతం 51.52 శాతం నుంచి 50.00 శాతానికి పడిపోయింది.

* టాప్-2లోకి ఆస్ట్రేలియా: ఈ మ్యాచ్‌కు ముందు 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (72.22%), డ్రా కారణంగా 66.67 శాతంతో 3వ స్థానానికి పడిపోయింది. దీంతో మ్యాచ్ ఆడకుండానే ఆస్ట్రేలియా (69.23%) రెండో స్థానానికి దూసుకొచ్చింది.

* టాప్‌లో దక్షిణాఫ్రికా (75.00%): డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా జట్టు 75 శాతంతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.  

భారత్ ఓడిపోవడానికి అసలు కారణం ఇదే: 

 నిన్న (ఆదివారం, నవంబర్ 22) నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 119 పరుగులు చేసిన న్యూజిలాండ్ ను ఇవాళ (సోమవారం, నవంబర్ 23,2026) భారత బౌలర్లు త్వరగా అవుట్ చేస్తే ఈ మ్యాచ్ గెలిచేందుకు టీమిండియాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ భారత బౌలర్లు మాత్రం ఐదో రోజు వెల్లింగ్టన్ పిచ్ పై ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. ఉదయం డ్రింక్స్ బ్రేక్ సమయానికి నిన్న అర్ధసెంచరీ కొట్టిన డెవాన్ కాన్వే వికెట్ మాత్రమే తీయగా, అనంతరం రచిన్ రవీంద్ర, బ్లండెల్ ను అవుట్ చేసినా అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ ఇండియన్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంది. 

క్రీజులో పాతుకుపోయిన మిచెల్, ఫిలిప్స్ జోడీని విడదీసేందుకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ తన దగ్గర ఉన్న అన్ని ఆప్షన్లను వాడేసినా ఫలితం మాత్రం దొరకలేదు. ఆరో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. ఆ తర్వాత కూడా మరో వికెట్ పడకుండా కాపాడుకుంది. దీంతో డ్రింక్స్ సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లకు 228 రన్స్ చేసింది. ఆ తర్వాత మరో 11 పరుగులు జోడించాక.. ఫలితం తేలే పరిస్దితి లేకపోవడంతో ఇరు జట్లూ డ్రాకు ఒప్పుకున్నాయి. మిచెల్ 49, ఫిలిప్స్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, బుమ్రా, కాంబోజ్, సుందర్ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లకు వికెట్లు దక్కలేదు. మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా కివీస్ ను భారత్ ఆలౌట్ చేయలేకపోయింది. నవంబర్ 27న క్రైస్ట్ చర్చ్ లో రెండో టెస్టు స్టార్ట్ కానుంది.