మనుమలు ఎండు పుల్లలు గడ్డి కుప్ప చేస్తే
తాత అందరి కోసం మంట రాజేశాడు !
చలిమంట చుట్టూ అందరూ
డాన్స్ చేస్తున్నారు వెచ్చనై !
చలి మంట ఏకతగా
అందరినీ గుంపు చేసింది !
మంచు పొగలో ఉన్న సూర్యుడూ
చలి మంటను తాకి వెచ్చ వెచ్చన
మంచు మకుటమైతే
చలికి మహాగర్వం కదా!
ఎంతటి చలి అయినా
మంట ముందు లోకువే!
- కందాళై రాఘవాచార్య-
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
