గుజరాత్‌‌‌‌‌‌‌‌లో కారును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు

గుజరాత్‌‌‌‌‌‌‌‌లో కారును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు
  • మృతులంతా సైనిక కుటుంబ సభ్యులే

భుజ్ (గుజరాత్): గుజరాత్‌‌‌‌లోని కచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో జాతీయ రహదారిపై కారును ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు ఆర్మీ కుటుంబ సభ్యులు మృతి చెందారు. 

కచ్ వెస్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి వివరాల ప్రకారం.. బాధితులంతా రణ్ ఆఫ్ కచ్ సందర్శన ముగించుకుని తిరిగి భుజ్‌‌‌‌కు వస్తున్నారు. ఈక్రమంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

మృతులంతా ఉత్తరాఖండ్‌‌‌‌లోని గర్హ్వాల్ ప్రాంతానికి చెందినవారని, భుజ్‌‌‌‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడించారు.  కాగా, ఈ విషాదంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బిహార్‌‌‌‌లో నలుగురు..

బిహార్‌‌‌‌లోని పాట్నా జిల్లాలో కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సబ్నిమా గ్రామంలో  ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ‘మృతులందరూ బఖ్తియార్‌‌‌‌పూర్‌‌‌‌లో జరిగిన ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది’ అని పోలీసులు తెలిపారు.