దేశవ్యాప్తంగా 26 వేల ప్రాంతాల్లో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ.. నవంబర్ 29న 100వ ఎడిషన్

 దేశవ్యాప్తంగా 26 వేల ప్రాంతాల్లో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ.. నవంబర్ 29న 100వ ఎడిషన్
  • దేశవ్యాప్తంగా ‘ఫిట్ ఇండియా’  సైకిల్ ర్యాలీ

గాంధీనగర్: ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం) థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దేశవ్యాప్తంగా 26,000 ప్రాంతాల్లో 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' 99వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. 

గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దండి కుటీర్, మహాత్మా మందిర్ వద్ద జరిగిన వేడుకల్లో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి క్రీడాకారులు, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ఔత్సాహికులతో కలిసి సైకిల్ తొక్కారు. నవంబర్ 29న జరగనున్న 100వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 'భారతదేశంలో ఒలింపిక్ ఉద్యమం' థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.