హైదరాబాద్ లో అక్రమ అండాల దందా కేసు ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలో అక్రమ అండాల దందా కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ పద్మజ, డాక్టర్ దుర్గారావులకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇద్దరు డాక్టర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను సోమవారం ( నవంబర్ 23 ) డిస్మిస్ చేసింది హైకోర్టు.
అక్రమ అండాల దందాకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందోస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు నిందితులు. ఈ కేసుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు న్యాయవాదులు.
అయితే..అమాయకులైన యువతులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి అండాలు సేకరించారని ప్రభుత్వం తరపు న్యాయవాది పల్లె నాగేశ్వర్ రావు వాదించారు. ఇరువైపులా వాదనల అనంతరం ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టేసింది హైకోర్టు.
