ఏ బిడ్డా.. ఇది కాషాయగడ్డ.. అని కరీంనగర్ తొడ కొట్టమంటోంది: బండి సంజయ్

ఏ బిడ్డా.. ఇది కాషాయగడ్డ.. అని కరీంనగర్ తొడ కొట్టమంటోంది: బండి సంజయ్

కరీంనగర్ లో బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసందోహాన్ని చూసి నన్ను కన్నా ఈ కరీంనగర్ గడ్డ ఉరకలెత్తుతోందని.. ఏ బిడ్డా, ఇది కాషాయగడ్డ అని తొడ కొత్తమంటోందని అన్నారు. నా మనసు పులకరిస్తోందని.. మన నాయకులు నితీన్ నబీన్ కరీంనగర్ నేల మీద అడుగు పెట్టిన తర్వాత నా గుండె ఉప్పొంగుతోందని అన్నారు బండి సంజయ్.

దేశం కోసం, ధర్మకోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం నా గడ్డ కొట్లాడమంటోందని.. బీజేపీ ఉనికి లేదని చెప్పేవాళ్లు.. ఈ గడ్డపై గర్జించిన మా వాళ్లను చూడండని అన్నారు. వందేమాతరం అని గర్జిస్తున్న మా దళాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ చూడాలని అన్నారు బండి సంజయ్. నితీన్ నబీన్ కొదమసింహమని... ఆయన కంటి చూపులో వాడి ఉందని అన్నారు. 

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత నితీన్ నబీన్, వాళ్ల అమ్మానాన్న పెట్టిన పేరుకు సార్థక తెచ్చారని అన్నారు.  నితీన్ అంటే నీతి నిజాయితీ... నబీన్ అంటే కొత్త పంథా అని అన్నారు బండి సంజయ్. నితిన్ 25 ఏళ్లకే ఎమ్మెల్యే, 45 ఏళ్లకే జాతీయ అధ్యక్షుడు అయ్యాడని అన్నారు బండి సంజయ్. 

తెలంగాణలో బీజేపీ, మోడీ, రామరాజ్యం రావాలని సంకల్పం తీసుకున్నామని... అందుకోసమే మా కార్యకర్తలు జెండాలు మోసి భుజాలు కాయలు కాసాయని అన్నారు బండి సంజయ్. తెలంగాణలో రామరాజ్యం, మోడీ రాజ్యం తేవడమే తమ ధ్యేయమని..శరీరంలో దేశభక్తి అనే రక్తం ప్రవహిస్తోందని... మాది రక్తం ఎర్రగా లేదు... కొండగట్టు అంజన్న శరీరం మీదున్న సింధూరం లాంటి కాషాయ రక్తం ప్రవహిస్తోందని అన్నారు బండి సంజయ్. 

మా గుండె లబ్ డబ్ అనడం లేదు.. జై శ్రీరాం, జైశ్రీరాం అంటోందని... బీజేపీ లేదంటున్న కుహనా శక్తులకు ఈ కార్యక్రమమే జవాబు అని అన్నారు బండి సంజయ్. 4 కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లు తీసేయడం తప్పా అని ప్రశ్నించారు. దేశ మాజీ ప్రధాని పీవీ 2004లో చనిపోతే... మొన్నటి ఎస్ఐఆర్ వరకు ఆయన పేరు ఓటర్ లిస్టు నుంచి తీయలేదని... 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని అన్నారు బండి సంజయ్. 

ఈ దేశపౌరుడే ఈ దేశ నేతను నిర్ణయించాలని... ఇతర దేశాల వాళ్లు ఇక్కడ ఉంటున్న లుఛ్ఛా నా కొడుకులను బోర్డర్ దాటించేదాకా తరిమికొడుతామని... వారి ఓట్లు తొలగించడం తప్పా అని ప్రశ్నించారు.  అంటూ పాకిస్తానోడు, బంగ్లాదేశోడు.. ఇక్కడి ఎమ్మెల్యేను నిర్ణయిస్తాడా? ఆఫ్గనిస్తానోడు ముఖ్యమంత్రని చేస్తాడా? అని ధ్వజమెత్తారు బండి సంజయ్.