సిరాజ్, జడేజా లేకపోవడం వల్లే మ్యాచ్ డ్రా అయిందా?.. శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే..! 

సిరాజ్, జడేజా లేకపోవడం వల్లే మ్యాచ్ డ్రా అయిందా?.. శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే..! 

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడంపై నెలకొన్న వివాదంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. 2020 నుంచి టెస్టుల్లో జట్టుకు కీలకంగా మారిన సిరాజ్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) లను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్ ఆధారంగానే జట్టును ఎంపిక చేసినట్లు గిల్ స్పష్టం చేశాడు. అలాగే రెండో టెస్టులోనూ దాదాపు ఇదే జట్టు కొనసాగే అవకాశం ఉందని కీలక సంకేతాలు ఇచ్చాడు.

సిరాజ్ నా మంచి స్నేహితుడు: శుభ్‌మన్ గిల్ 

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిరాజ్‌ను తప్పించడంపై శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. సిరాజ్ నాకు చాలా మంచి స్నేహితుడు.. చిన్నప్పటి నుంచి తెలుసు, కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం.. అతడిని తప్పించడం చాలా కష్టమైన నిర్ణయం.. ఈ మ్యాచ్‌కు ముందే సిరాజ్‌తో మాట్లాడి కారణం వివరించాను, అతడు అర్థం చేసుకున్నాడని గిల్ తెలిపాడు. ప్రతి ఆటగాడి కెరీర్‌లోనూ అత్యుత్తమ ఫామ్‌లో లేని దశ ఉంటుంది. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేము జట్టును ఎంచుకున్నాం.. సిరాజ్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరింత బలంగా పుంజుకుంటాడని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

ALSO READ ; ఇలా జరుగుతుందని అనుకోలేదు..

సిరాజ్, జడేజా లేకపోవడం వల్లే డ్రా అయిందా: గిల్ 

ఐదు వికెట్ల దూరంలో భారత్ విజయం చేజార్చుకోవడానికి సిరాజ్, జడేజా లేకపోవడమే కారణమా అనే ప్రశ్నకు శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. నేను అలా అనుకోవడం లేదు, ఈ పిచ్‌పై సీమర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు.. స్పిన్నర్లకు కొద్దిగా సహకారం ఉన్నా, పెద్దగా ప్రభావం చూపేంతగా లేదన్నాడు. కాబట్టి వారు ఉన్నా ఫలితం వేరేలా ఉండేదని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఇక క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే రెండో టెస్టులో సిరాజ్, జడేజా తిరిగి వస్తారా అనే దానిపై గిల్ ఇంకా క్లారి టీ ఇవ్వలేదు. రెండో టెస్టులోనూ జట్టు దాదాపు ఇదే జట్టు కొనసాగే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చాడు.