ఇలా జరుగుతుందని అనుకోలేదు.. 15 ఓవర్లు ఉండగానే డ్రాకు ఒప్పుకోవడంపై గిల్ కీలక వ్యాఖ్యలు!

ఇలా జరుగుతుందని అనుకోలేదు.. 15 ఓవర్లు ఉండగానే డ్రాకు ఒప్పుకోవడంపై గిల్ కీలక వ్యాఖ్యలు!

Shubman Gill: వెల్లింగ్టన్ వేదికగా బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. భారత్ విజయానికి 5 వికెట్లు అవసరమైన దశలో కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అడ్డుగోడలా నిలబడి, తమ జట్టుని ఓటమి నుంచి తప్పించడంపై గిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలాగే మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే మ్యాచ్ ఎందుకు డ్రా చేసుకోవడానికి అంగీకరించాల్సి వచ్చిందో కూడా శుభ్‌మన్ క్లియర్ గా వివరించాడు.

మిచెల్, ఫిలిప్స్ మాకు విజయాన్ని దూరం చేశారు: 

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మ్యాచ్ గెలుస్తామని మేము అనుకున్నాం.. ఈ పిచ్‌పై 10 వికెట్లు తీయడం సవాల్‌తో కూడుకున్న పని అని మాకు ముందే తెలుసు.. కానీ కివీస్‌ను ఆలౌట్ చేసే అవకాశాలు వచ్చాయి.. మిచెల్, ఫిలిప్స్ అద్భుతంగా పోరాడి మాకు విజయం దక్కకుండా చేశారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. విదేశీ గడ్డపై బౌన్సీ పిచ్‌లపై మా బ్యాటర్లంతా భారీ ఇన్నింగ్స్‌లు ఆడి 700+ స్కోరు సాధించడం చాలా సంతోషంగా ఉందని గిల్ పేర్కొన్నాడు.

15 ఓవర్లు ఉండగానే డ్రాకు ఎందుకంటే: 

చివరి రోజు 15 ఓవర్ల మ్యాచ్ మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. 

పిచ్ సహకరించలే.. బౌలర్లు అలసిపోయారు: 15 ఓవర్లు మిగిలి ఉండగానే డ్రాకు అంగీకరించడం వెనుక ప్రత్యేక కారణాలేమీ లేవు అని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. వెల్లింగ్టన్ పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం అందడం లేదు.. అందులోనూ మా ఫాస్ట్ బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేసి బాగా అలసిపోయారు.. ఆ 15 ఓవర్లు వేసినా ఐదు వికెట్లు తీస్తామన్న గ్యారంటీ లేకపోవడంతోనే డ్రా చేసుకునేందుకు ఒప్పుకున్నామని గిల్ స్పష్టం చేశాడు.

క్రైస్ట్‌చర్చ్ టెస్టుపై దృష్టి: మూడు రోజుల విరామం తర్వాత రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆటగాళ్లకు ఒకరోజు పూర్తి విశ్రాంతి ఇచ్చి తిరిగి ప్రాక్టీస్ మొదలు పెడతామని, క్రైస్ట్‌చర్చ్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.