సాగర్ సొరంగం పాపం కేసీఆర్ దే...కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు: సీఎం రేవంత్

సాగర్ సొరంగం పాపం కేసీఆర్ దే...కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు: సీఎం రేవంత్

సాగర్ కు సొరంగం తవ్విన పాపం కేసీఆర్ దే అని.. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని అన్నారు సీఎం రేవంత్. సోమవారం ( నవంబర్ 23 ) కేఆర్ఎంబీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. బీఆర్ఏస్ పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. మొదటి నుంచి కృష్ణా జలాల హక్కులను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని.. ఇందుకు సంబంధించి ఆధారాలను యవల బయటపెడుతున్నానని అన్నారు సీఎం రేవంత్.

తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడుతుంటే..బీఆర్ఎస్ పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తోందని అన్నారు సీఎం రేవంత్. పల్నాడు వాటర్ గ్రిడ్ ను మేము అడ్డుకోలేదని ప్రచారం చేస్తున్నారని.. జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై జీవో విడుదలైందని.. అప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారని అన్నారు సీఎం రేవంత్. రూ.12 వేల కోట్లతో పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలని అప్పట్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ అంశాన్ని వ్యతిరేకించలేదని అన్నారు సీఎం రేవంత్.

అప్పుడు ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పకుండా ఇప్పుడు తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. పల్నాడు వాటర్ గ్రిడ్ పై మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఫిర్యాదు చేసారని అన్నారు. 2004లో వైఎస్ఆర్ మంత్రివర్గంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నారని..అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 88వేల క్యూసెక్కులకు పెంచారని.. అప్పుట్లో నాయిని నర్సింహారెడ్డి కడప ఇంచార్జి మంత్రిగా ఉన్నారని అన్నారు.

2005లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ప్రవేశపెట్టారని..2009 సెప్టెంబర్ లో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై జీవో వచ్చిందని.. అప్పుడు అసెంబ్లీలో నిలదీయకుండా ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు అన్నారు సీఎం రేవంత్.