కేసీఆర్ ఏపీకి మంచి మనిషి... తెలంగాణను ముంచే మనిషి: సీఎం రేవంత్

కేసీఆర్ ఏపీకి మంచి మనిషి... తెలంగాణను ముంచే మనిషి: సీఎం రేవంత్

కేసీఆర్ మంచి మనిషి, ఏపీకి మంచి చేస్తారని అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్నారని..కేసీఆర్ ఏపీకి మంచి మనిషి.. తెలంగాణను ముంచే మనిషి అని దుయ్యబట్టారు సీఎం రేవంత్. సోమవారం ( నవంబర్ 23 ) కేఆర్ఎంబీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేసీఆర్ ఏనాడూ అనుకోలేదని.. పంపులు  మోటార్లు పెట్టి కమిషన్లు దండుకోవాలని ప్లాన్ చేశారని అన్నారు సీఎం రేవంత్.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించామని.. నిధులు కేటాయించామని అన్నారు సీఎం రేవంత్. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా ముంపు గ్రామాలను ఎలా తరలించగలమని అన్నారు. 

కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్లే ఇవాళ మనపై ఏపీ దాడి చేస్తోందని అన్నారు. ఇవన్నీ అసెంబ్లీలో చెప్పాలని అనుకున్నామని...కానీ ఆలోపే కేటీఆర్, హరీష్ రావు ఊరూరా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరి హయాంలో వచ్చిందో చెప్పాలని.. ఏపీ ఎన్నో ప్రాజెక్టులు కట్టుకునేందుకు కెసిఆర్ సహకరించారని..ప్రజలు బీఆర్ఎస్ అవినీతిని చూసే ఇంటికి పంపించారని అన్నారు సీఎం రేవంత్. ఇంకా ఎన్ని రోజులు అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతారని అన్నారు సీఎం రేవంత్.