తిరువనంతపురం: కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించడం పొలిటికల్ డ్రామా అని సీపీఐ(ఎం) సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు ఉద్యోగాలు, వేతనాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం 'ఎక్స్' వేదికగా స్పందించారు.
గత 12 ఏళ్లుగా కార్పొరేట్ పన్నులు తగ్గిస్తూ, పెద్ద వ్యాపార సంస్థలకు రాయితీలు కల్పించిన మోదీ.. ఇప్పుడు సామాన్యుల తరఫున మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారని విజయన్ మండిపడ్డారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఆర్థిక విధానాలు అమలు చేసి, ఇప్పుడు వారిని నిలదీస్తున్నట్లు మాట్లాడితే బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
