బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ‘కాలియా’ పేరుతో ఈ మాన్‌స్టర్ థ్రిల్లర్ రూపొందబోతోంది. ఈ చిత్రంతో కార్తీక్ ఆర్యన్ నిర్మాతగా కూడా మారుతుండటం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థ ‘డోపమైన్ స్టూడియోస్’ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా తదితరులతో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘పూర్వం పవిత్రనదిలో కాలియా అనే రాక్షసుడు ఉండేవాడు.
శ్రీకృష్ణుడు అతడితో పోరాడి ఓడించాడు..’ అంటూ ఓ పెద్దవిడ మనవడికి కథ చెబుతుంటే.. మరోవైపు నది ఒడ్డున ఉన్న కుక్కను భారీ మాన్‌స్టర్ వచ్చిన మింగేయడాన్ని చూపించారు. టీజర్ చివర్లో ‘శ్రీకృష్ణుడు ఆ రాక్షసున్ని దూరంగా పంపేశాడు.. కానీ మనుషులం మనమే దానిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చాం’ అనే క్యాప్షన్ ఇవ్వడం సినిమా కథపై అంచనాలను పెంచింది. పురాణ ఇతిహాసాలు, జానపద కథల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సందీప్ మోదీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య, ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్‌లు తెరకెక్కించిన తనకు ఇదే ఫస్ట్ థియేట్రికల్ మూవీ. 2028 మే 5న సినిమా విడుదల కానుంది.
