‘డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం’ నినాదంతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ వాక్స్-నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి రావాలని సినీనటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ప్రభాస్‌తో కలిసి యాత్ర టీ షర్ట్‌ను ఆవిష్కరించారు. నషా ముక్త్ భారత్ ఉద్యమానికి తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.
