నవంబర్ 26న అచ్చంపేటలో సీఎం పర్యటన

నవంబర్ 26న అచ్చంపేటలో సీఎం పర్యటన
  •     ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే

అమ్రాబాద్, వెలుగు: ఈ నెల 26న సీఎం రేవంత్​రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం మద్దిమడుగు, అచ్చంపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మద్దిమండుగులో సంత్​సేవాలాల్​ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సుమారు 5 వేల మంది గిరిజనులతో సభ నిర్వహించనున్నారు. 

ఆ తర్వాత అచ్చంపేటలో సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఆయా సభల కోసం ఆఫీసర్లు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఎంపీ డాక్టర్​మల్లు రవి, కలెక్టర్​ హేమంత్​కేశవ్​పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్​వంశీకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.