- మెదక్ జిల్లాలో ‘పౌష్టిక్’ ఫుడ్ ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభం!
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ మహిళలను ఆహార శుద్ధి రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఓడబ్ల్యూఈ ఇండియా, ఎస్‌ఈఆర్‌పీ తెలంగాణ సంయుక్తంగా ‘పౌష్టిక్ – ఫుడ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని’ ప్రారంభించాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారం గ్రామంలో శనివారం ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలకు చిరుధాన్యాలు, రెడీ-టు-ఈట్, రెడీ-టు-కుక్ ఆహార ఉత్పత్తుల తయారీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలు, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌పై శిక్షణతో పాటు ఆధునిక యంత్రాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తారు.
