జన్నారం: కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో విదేశీ పక్షుల సందడి

జన్నారం: కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో విదేశీ పక్షుల సందడి
  • అరుదైన వలస పక్షులతో కళకళలాడుతున్న టైగర్ రిజర్వ్

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ అరుదైన వలస పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కొ ఆర్డినేటర్ డాక్టర్ వెంకట్ అనగందులతో కలిసి నిర్వహించిన ఫీల్డ్ అబ్జర్వేషన్‌‌‌‌లో రెడ్-హెడెడ్ బంటింగ్, ఆలివ్-బ్యాక్డ్ పిపిట్, సైబీరియన్ స్టోన్ చాట్, గార్గనీ, నార్తర్న్ పింటెయిల్ వంటి విదేశీ పక్షులను గుర్తించినట్లు జన్నారం ఎఫ్‌‌‌‌డీవో ఎం.రామ్మోహన్ తెలిపారు. 

ఆదివారం ఫారెస్ట్ ఆఫీసులో  ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ ఈ పక్షులు మధ్య ఆసియా, సైబీరియా, ఉత్తర యూరప్ ప్రాంతాల నుంచి శీతాకాలంలో కవ్వాల్‌‌‌‌కు వలస వస్తాయని వెల్లడించారు. కవ్వాల్‌‌‌‌లోని అడవులు, గడ్డి మైదానాలు, చెరువులు, నీటి వనరులు పక్షులకు అనుకూలమైన ఆవాసాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వలస పక్షుల రాక కవ్వాల్ టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి నిదర్శనమని తెలిపారు.