- మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు
- ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. ఈ కొత్త రేట్లు ఆదివారం (నవంబర్ 22) నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిసరుకుల ఖర్చుల భారం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. మారుతీ కార్ల ధరలు సగటున 0.31 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో మారుతీ ఇప్పటికే మూడుసార్లు కలిపి ఒక శాతానికి పైగా ధరలను పెంచింది. కస్టమర్లపై భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల్లో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయక తప్పడం లేదని సంస్థ తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిసరుకు ఖర్చుల పెరగడంతో, రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినప్పటికీ సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం ఏడాదిలెక్కన 26.36శాతం తగ్గి రూ. 2,466.1 కోట్లకు పరిమితమైంది.
