హెడ్మాస్టర్ల సంఘం నూతన స్టేట్ కమిటీ ఎన్నిక

హెడ్మాస్టర్ల సంఘం నూతన స్టేట్ కమిటీ ఎన్నిక
  • ప్రెసిడెంట్​గా గిరిధర్ గౌడ్, జనరల్ సెక్రటరీగా రాజాగంగారెడ్డి

 హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రాజాగంగారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం బాలానగర్ లో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పదవికి రాజాగంగారెడ్డి పోటీ చేయగా.. తమ సమీప ప్రత్యర్థులపై సుమారు190 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు మురళీకృష్ణ మూర్తి, రాధాకృష్ణ, కృష్ణ, శ్యాంసుందర్ ప్రకటించారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.