దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర కో రైటర్‌గా వర్క్ చేసిన ఎస్ కృష్ణ నటుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘హై’. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, మాస్టర్ రేవంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 27న సినిమా విడుదల కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశా. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ చేయాలని సాయి చాలా కొత్తగా ప్రయత్నించాడు. నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో పాటు వికాస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది. ఇది చిన్న సినిమా అయినా పెద్ద స్కేల్‌లో తీశారు. తప్పకుండా అందరికీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా’ అంటూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. డైరెక్టర్, హీరో ఎస్ కృష్ణ మాట్లాడుతూ ‘నేను యాక్టర్ కావడం మా నాన్న గారి కల. ఇందులో ఓ క్యారెక్టర్ చేయమని అనిల్ రావిపూడి నన్ను బూస్ట్ చేశాడు. తనతో నాకు ఇరవై ఏళ్ల అనుబంధం. ఇక ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరూ చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి, అదిరే అభి, అభినవ్ గోమఠం నా కోసం వచ్చి పనిచేశారు’ అని తెలిపాడు. నటీనటులు శ్రీనివాస్ వడ్లమాణి, అదిరే అభి, సాయి కృష్ణ, అనన్య శర్మ, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
