హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 5.11 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు : కలెక్టర్ ప్రియాంక ఆల

 హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 5.11 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు : కలెక్టర్ ప్రియాంక ఆల
  •     నేటి నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్తరు: కలెక్టర్​ ప్రియాంక ఆల

హైదరాబాద్ సిటీ/గండిపేట, వెలుగు: హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో విజయవంతమైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. ఆదివారం ఆసిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ చింతల్ బస్తీ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో డీఎంహెచ్​వో పుట్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణికుల పిల్లలకు కూడా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  జిల్లాలోని 5.22 లక్షల మంది చిన్నారులకు గానూ ఆదివారం ఒక్కరోజే 5,11,641 మందికి(94.18 శాతం) చుక్కలు అందించామన్నారు. 

38 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి 24 అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా పోలియో చుక్కలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రాలేకపోయిన చిన్నారుల కోసం ఈ నెల 23, 24, 25 తేదీల్లో వైద్య సిబ్బంది మొత్తం 9,26,153 ఇండ్లను సందర్శించి చుక్కలు వేస్తారని చెప్పారు. క్లస్టర్ అడిషనల్​డీఎంహెచ్​వో డాక్టర్ మురళీధర్, డీఐవో డాక్టర్ శ్రీధర్, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

బుద్వేల్ ప్రభుత్వ దవాఖానలో..

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి,  డీఎంహెచ్​వో డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి సూచించారు. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ప్రభుత్వ దవాఖానలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్ రాకేశ్, డీఐవో డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.