నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేస్తోంది.. నెల్లూరులో లాంచ్ ఈవెంట్

నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేస్తోంది.. నెల్లూరులో లాంచ్ ఈవెంట్

నాగచైతన్య నుంచి రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌‌గా నటించింది.  కార్తీక్ దండు దర్శ కుడు. ఎస్‌‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 4న సినిమా విడు దల కానుంది.  ఇప్పటికే ప్రమోషన్స్‌‌ స్టార్ట్‌‌ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌‌‌‌ రిలీజ్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 25న ట్రైలర్‌‌‌‌ ను విడుదల చేయబోతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నెల్లూరులో ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌ను నిర్వహించబోతున్నట్టు తెలియజేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌‌ మెంట్ పోస్టర్‌‌‌‌లో భుజంపై తాడు, ఒక చేతిని ముందుకు చాపి స్టైలిష్ లుక్‌‌లో కనిపిస్తున్నాడు నాగచైతన్య. మల యాళ నటుడు జయరామ్, హీరోయిన్‌‌ మీనాక్షి చౌదరి తనకు చెరోవైపు కనిపిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ,  సస్పెన్స్‌‌ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా సినిమా ఉండబోతోందని మేకర్స్‌‌ చెబుతున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా ఖన్నా, సత్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజ నీష్ లోకనాథ్ సంగీతం, రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.