హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పార్క్ భూ సమస్యపై సీఎంను కలుస్తాం : ఎమ్మెల్సీ కోదండరాం

హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పార్క్ భూ సమస్యపై సీఎంను కలుస్తాం : ఎమ్మెల్సీ కోదండరాం
  • ఐక్య పోరాటంతోనే బాధితులకు న్యాయం: ఎమ్మెల్సీ కోదండరాం

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, ఎంఎం కుంట, నాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుల్ పరిధిలోని హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పార్క్ భూసేకరణతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలుస్తామని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆదివారం హైదరాబాద్​లోని బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన భూ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బాధితులంతా ఐక్యంగా పోరాడితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సేకరించిన భూ వివరాలు, న్యాయపరమైన అంశాలతో కూడిన లేఖను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా సీఎంకు అందిస్తామని భరోసా ఇచ్చారు. 2004లో సుమారు 5 వేల ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు జారీ కాగా, పరిహారం చెల్లించని భూములను సైతం టీజీఐఐసీ పేరిట నిషేధిత జాబితాలో చేర్చారని అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ, హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ) నాయకులు ఆరోపించారు. మధ్యతరగతి ప్రజల ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి, సుమారు 20 వేల మంది బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు అంబటి నాగయ్య, సీపీఐ నేత ఇ.టి.నరసింహ డిమాండ్ చేశారు.