ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటున్నరు : ST SC తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రమేశ్నాయక్

ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటున్నరు : ST SC తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రమేశ్నాయక్
  • ఆయన విషయంలో మంత్రి శ్రీధర్ బాబు వైఖరి మారాలి
  • ఎస్టీ, ఎస్సీ తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్​ నాయక్

సైఫాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎస్టీ, ఎస్సీ తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రమేశ్​నాయక్, ప్రధాన కార్యదర్శి వి.సుధాకర్ అన్నారు. ఆయన విషయంలో మంత్రి శ్రీధర్ బాబు తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 

ఆదివారం హైదరాబాద్​లోని సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి తన వైఖరిని మార్చుకోకపోతే ఆయన నివాసం ఎదుట ధర్నా చేస్తామన్నారు. సమితి ట్రెజరర్​అర్జున్ నాయక్, నాయకులు మదన్, సుమన్ తదితరులున్నారు.