రష్మిక మందన్న ఫ్యాన్స్‌కు షాక్.. ‘మైసా’ విడుదల వాయిదా

రష్మిక మందన్న ఫ్యాన్స్‌కు షాక్.. ‘మైసా’ విడుదల వాయిదా

రష్మిక మందన్న  లీడ్‌‌ రోల్‌‌లో రూపొందిన చిత్రం ‘మైసా’.  రవీంద్ర పుల్లే దర్శకత్వంలో   అన్‌‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై అజయ్, అనిల్‌‌ సయ్యపురెడ్డి 
నిర్మిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో సహా ప్రమోషనల్ కంటెంట్‌‌కు పాజిటివ్ రెస్పాన్స్‌‌ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ గురించి కీలక ప్రకటన చేశారు మేకర్స్‌‌.  నవంబర్‌‌‌‌ 27న సినిమా విడుదల కావల్సి ఉంది. అయితే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యుత్తమ ప్రమాణాలతో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది.  

ఆ స్ఫూర్తితో ప్రేక్షకులకు వెండితెరపై ఒక విభిన్నమైన, అద్భుతమైన యాక్షన్ అనుభూతిని అందించేలా 'మైసా' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో టీమ్ అంతా కలిసి సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలో సినిమా కొత్త విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని చెప్పారు. గోండు గిరిజన మహిళగా రష్మిక నటిస్తున్న ఈ చిత్రంలో  ఈశ్వరి రావు, సముద్రఖని,  గురు సోమసుందరం, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.