వారంలో ఒకరోజు సైకిల్ ఉపయోగించండి : సైబరాబాద్ సీపీ రమేశ్ సూచన

వారంలో ఒకరోజు సైకిల్ ఉపయోగించండి : సైబరాబాద్ సీపీ రమేశ్ సూచన

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​నగరంలో ట్రాఫిక్​ రద్దీ, వాహన కాలుష్య నివారణ కోసం ప్రతిఒక్కరూ వారంలో ఒకరోజు సైకిల్ ఉపయోగించాలని సైబరాబాద్​సీపీ రమేశ్ సూచించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు రాయదుర్గంలోని టీ హబ్​లో సైబరాబాద్​మూవ్స్​పేరుతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జేఎన్​టీయూ నుంచి హైదరాబాద్​సెంట్రల్​యూనివర్సిటీ వరకు స్పోర్ట్స్​అథారిటీ చైర్మన్​శివసేనారెడ్డి, రాష్ట్ర పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి సైకిల్ ర్యాలీ చేపట్టారు. 

ట్రాఫిక్​సమస్యల పరిష్కారం, రోడ్డు భద్రత, ప్రజా రవాణా ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై అందరికీ అవగాహన కల్పించడం కోసం సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ట్రాఫిక్​ నిర్వహణ, రద్దీ నివారణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని కోరారు. మాజీ కార్పొరేటర్​ నార్నె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.