5 జిల్లాల్లో 95.55% పోలియో కవరేజీ ..

 5 జిల్లాల్లో 95.55% పోలియో కవరేజీ ..
  • 18.01 లక్షల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 17.21 లక్షల మంది చిన్నారులకు చుక్కలు 
  • 98.50 శాతంతో హనుమకొండ ఫస్ట్.. 98.14 శాతంతో రంగారెడ్డి సెకండ్ 

హైదరాబాద్, వెలుగు: పోలియో నిర్మూలనలో భాగంగా ఐదు జిల్లాల్లో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే (ఎస్ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీ) నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం హైదరాబాద్, హనుమకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 18,01,698 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 17,21,545 మందికి (95.55 శాతం) వ్యాక్సిన్ అందించారు. నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 3 జిల్లాల్లో ఈ నెల 25 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆల్ఫోన్స్ కాలేజీలో కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మహమ్మద్ ముష్రాఫ్ అలీ ఫారూఖీ అక్కడ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 98.50 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ముందంజలో నిలించింది.

ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 4,33,289 టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 4,25,225 మందికి (98.14 శాతం), సంగారెడ్డి జిల్లాలో 1,99,702 మందికి గాను 1,89,309 మందికి (94.80 శాతం) పోలియో చుక్కలు అందించారు. హైదరాబాద్ జిల్లాలో 5,43,235 మంది చిన్నారులకు గాను 5,11,641 మందికి (94.18 శాతం) పోలియో చుక్కలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.