- వందల కిలోమీటర్లు దాటుతూ అటవీ శాఖకు సవాల్
- కోనసీమ, పాపికొండలు, నూజివీడు మీదుగా మైలవరం అడవుల్లోకి..
- ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ కదలికలు..
- రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని తాడోబాఅడవుల నుంచి బయలుదేరిన నాలుగేండ్ల మగపులి వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అటవీశాఖ అధికారులకు సవాల్ విసురుతున్నది. తాజాగా ఏపీలోని ఎన్టీ ఆర్ జిల్లా మైలవరం అటవీప్రాంతంలో ఈ పులిజాడ కనిపించింది. ఎ.కొండూరు మండలం చీమలపాడు తండా సమీపంలో కదలికలను గుర్తించిన అధికారు లు..ఏపీ, తెలంగాణ సరిహద్దు అడవుల్లో సంచరిస్తున్న ట్లు నిర్ధారించారు. దీంతో రెడ్డిగూడెం. ఎ.కొండూరు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రాష్ట్రాల అటవీ శాఖలు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించాయి.
పాపికొండల్లో వదిలినా ఆగని ప్రయాణం..
ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలోని తాడోబా, అంధారీ టైగర్ రిజర్వ్ నుంచి బయలుదేరిన ఈ పులి ఫిబ్రవరిలో ఏపీలోని కోనసీమ జిల్లా కూర్మాపురం దగ్గరికీ చేరింది. అక్కడ అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మెడకు జీపీఎస్ కాలర్ అమర్చి, రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పాపికొండల నేషనల్ పార్క్ వదిలి పెట్టారు. అయినా అక్కడే ఉండకుండా నూజివీడు పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించి ఇప్పుడు మైలవరం అడవుల్లోకి చేరింది.
తెలంగాణ అడవుల మీదుగా వెళ్లినా గుర్తించలేదా?..
తాడోబా నుంచి కోనసీమకు చేరుకోవాలంటే తెలంగాణ అటవీ ప్రాంతాలను దాటాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి మధ్య వందల కిలోమీటర్లు ప్రయా ణించిన పులి కదలికలను తెలంగాణ అటవీ అధి కారులు ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు వస్తున్నాయి. అడవుల్లో కెమెరా ట్రాప్లు తక్కువగా ఉండటమే కారణమా? లేక రాత్రివేళల్లో జనావాసాల కుదూరంగా నదీ పరీవాహక అటవీ కారిడార్ల గుండా ప్రయాణించిందా? అనే చర్చ జరుగుతున్నది.
తాడోబాకు తిరిగొస్తున్నదా? తోడు కోసమా..
నూజివీడు నుంచి ఏపీ, తెలంగాణ సరిహద్దు అడవుల వైపు పులి కదలికలు కనిపిస్తుండటంతో అది తిరిగి తాడోబా వైపు వెళ్తున్నదా అనే అనుమానాలు వ్య క్షమవుతున్నాయి. అయితే నాలుగేండ్ల మగపులి కావడంతో కొత్త ఆవాసం ఏర్పాటు చేసుకోవడం, తోడు కోసం వెతుక్కుంటూ ఇలా ప్రయాణిస్తుండవ చ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎ.కొండూరు అటవీ ప్రాంతం వెంట సంచరిస్తుండ టంతో సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
