మూడు తుఫాన్లోచ్చినా.. మిగిలింది నిరాశే!.. తెలంగాణపై ప్రభావం చూపని అర్నబ్, మురసు, అక్వాన్

మూడు తుఫాన్లోచ్చినా.. మిగిలింది నిరాశే!.. తెలంగాణపై ప్రభావం చూపని అర్నబ్, మురసు, అక్వాన్
  • 23 రోజుల్లో మూడు తుఫాన్లు.. రాష్ట్రంలో జాడలేని వానలు
  • అర్నబ్ తూర్పు జిల్లాల్లో భారీ వానలు
  •  మురసుతో మామూలు జల్లులే.. అక్వాన్​ తో  చినుకు కరువు
  • అకాల వానలు, వచ్చే ఏడాది రుతుపవనాలపైనే ఆశలు

హైదరాబాద్,వెలుగు:బంగాళాఖాతంలో కేవలం 23 రోజుల వ్యవధిలో వరుసగా మూడు తుఫాన్లు వచ్చినా.. తెలంగాణకు నిరాశ ఎదురైంది. కరువు పరిస్థితులు, ఎల్​ నినో ఎఫెక్ట్​ లతో అల్లాడుతున్న రాష్ట్రానికి ఆ తుఫాన్లతోనై నా వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీళ్లొచ్చి యాసంగికి మేలు జరుగుతుందని అంతా ఆశలు అడియాసలే అయ్యాయి. 

అక్టోబర్ 28 నుంచి నవంబర్ 20 మధ్య అర్నబ్, మురసు. అక్వాన్ తుఫాన్లు వచ్చినా రాష్ట్రం పై పెద్దగా ప్రభావం చూపలే కపోయాయి. అంతో ఇంతో అర్నబ్ తుఫానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిపించగా, ఆ తర్వాత వచ్చిన మురసు మామూలు వానలతో సరిపెట్టింది. ఇక భారీ వర్షాలు కురిపిస్తుందనుకు న్న అక్వాన్ తుఫాన్ ఏకంగా నాలుగు సార్లు దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లిపోవడంతో రాష్ట్రంలో కనీసం చినుకు జాడ కూడా లేకుండా పోయింది.

అర్నబ్​ తో  అంతో ఇంతో.. మురసుతో అంతంతే..


ఈ సీజన్​ లో  తొలుత ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ 'అర్నబ్ ' అక్టోబర్ 28న ఏపీలోని నర్సాపూర్ యానాం మధ్య తీరం దాటింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదలడంతో తూర్పు తెలంగాణ
జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్,సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి. 

ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరువు తీరేలా వర్షాలు పడలేదు. ఆ తర్వాత వారం తిరగకముందే నవంబర్ 3న 'మురసు' తుఫాన్ ఏపీలోని ఒంగోలు వద్ద తీరం దాటింది. ఇది తెలంగాణ మీదుగానే ప్రయాణిస్తుందని భావించి వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. కానీ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాలు మినహా మిగతా రాష్ట్రమంతా సాధారణ, తేలికపాటి వానలతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది.

ట్రాక్ తెలంగాణపై నుంచే.. కానీ నాలుగు సార్లు యూటర్న్..

మూడో తుఫాన్ ' అక్వాన్ 'పై రైతులు, అధికారులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తొలుత బంగాళా ఖాతంలో వాయుగుండంగా ఏర్పడినప్పుడు దీని ట్రాక్ చెన్నై - బాపట్ల మధ్య తీరం దాటి నేరుగా తె లంగాణపై నుంచే వెళ్తుందని వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. 

దీంతో నవంబర్ 20, 21 తేదీల్లో తూర్పు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లా లకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. కానీ ఆ తర్వాతసముద్రంలో గాలుల దిశ, ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రభావం (సబ్ ట్రాపికల్ రిడ్జ్) వల్ల అక్వాన్ అనూహ్యంగా నాలుగు సార్లు తన మార్గాన్ని మా ర్చుకుంది. మచిలీపట్నం నుంచి కాకినాడకు, ఆ తర్వాత విశాఖకు, చివరకు నవంబర్ 20న ఒడి శాలోని గోపాల్ పూర్ వైపు మళ్లి తీరం దాటింది. 

ఈ క్రమంలో సముద్రంలోనే బలహీనపడటం, ఒడిశా-బెంగాల్ వైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో చినుకు కూడా పడలేదు. అక్వాన్ తుఫాన్ దిశ మార్చుకుని దూరంగా వెళ్లిపోవడంతో రాష్ట్రంపై దాని ప్రభావం సున్నాగా మారిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు రాష్ట్రంలో పొడి వాతావర ణం, చలి తీవ్రత పెరగడంతో మేఘాలు ఏర్పడే పరి స్థితి లేకుండా పోయింది. 

ఇప్పటికే ఎల్సినో ప్రభా వంతో ఈ ఏడాది వానాకాలంలో ఆశించిన వర్షాలు పడక ప్రాజెక్టులు, భూగర్భ జలాలు తగ్గిపోయాయి. తుఫాన్ల సీజన్ (నవంబర్) కూడా ముగింపు దశకు రావడంతో ఇక ఈ శీతాకాలంలో భారీ వర్షాలకు అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మళ్ళీ వచ్చే ఎండాకాలంలో (మార్చి- మే మధ్య) పడే క్యుములోనింబస్/అకాల వానలు.. లేదంటే వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాల పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.