నడిరోడ్డు మీద పులి.. బైకర్ కి దడ పుట్టించింది కదా..!

నడిరోడ్డు మీద పులి.. బైకర్ కి దడ పుట్టించింది కదా..!

రోడ్డుపై బైక్ నడుపుతూ ఆఫీసుకో, లేక ఏదైనా పని మీదనో వెళ్తున్నాం అనుకోండి... కొంచెం దూరంలో ఎదో జంతువు కనిపించి.. దగ్గరికెళ్లి చూస్తే పులి.. అది కూడా పది అడుగుల దూరంలో.. ఎలా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి..! దడ పుడుతుంది కదా.. వణికిపోతాం కదా.. గుండెలు జారిపోతాయి కదా..! మహారాష్ట్రలో ఇలాంటి సీన్ జరిగింది. రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న అతడికి పది అడుగుల దూరంలో పులి ప్రత్యక్షమై వణికించింది.ఆదివారం ( నవంబర్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

మహరాష్ట్ర. చంద్రపూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. జిల్లాలోని మోహర్లి రోడ్డుపై   బైకర్ కి దడ పుట్టించింది పులి. కేవలం పది ఫీట్ల దూరంలో పులి కనిపించడంతో వణికిపోయాడు బైకర్. 

పట్టపగలు నడిరోడ్డు మీద పులి కనిపించడంతో అవాక్కయ్యాడు బైకర్. అయితే, సదరు బైకర్ షాక్ నుంచి తేరుకొని వెంటనే హెల్మెట్ ధరించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది పులి. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు బైకర్.