పెళ్లి చూపుల్లో ఒకప్పుడు అబ్బాయి జీతం, ఆస్తులు చూసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు 'మ్యారేజ్ మార్కెట్'లో అంచనాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇద్దరూ సంపాదిస్తేనే మంచి లైఫ్‌స్టైల్ సాధ్యమనే ఆలోచన నేటి యువతలో బలంగా నాటుకుపోయింది. సరిగ్గా ఇదే అంశంపై సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక ఘటన ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసి ట్రెండింగ్ అవుతోంది.
శీతల్ రిజ్వానీ అనే యూజర్ తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని పోస్టు చేయటంతో విషయం వైరల్ గా మారింది. ఏడాదికి సుమారు రూ. 30 లక్షల ప్యాకేజీ అందుకుంటున్న తన స్నేహితుడికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి.. పెళ్లయిన తర్వాత జాబ్ మానేస్తానని చెప్పడంతో సున్నితంగా ఆ మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ చేశాడంట. తనకు ఉద్యోగం చేసే లైఫ్ పార్ట్నర్ కావాలనే తన ప్రాధాన్యతను అతను ముందే స్పష్టం చేశాడు.
A friend of mine earning around ₹30 LPA rejected a girl for marriage because she said she didn't want to work after marriage. He prefers a working partner, and when he made that clear, she got super offended, called him anti-feminist and his thinking regressive and said he clearly wanted to control his future wife's choices. She even told her family that he was narrow-minded, lacked basic manners and didn't know how to talk to women. Now his own family is angry with him because his parents have business relations with her family. I mean, isn't having a preference also a personal choice? Why is it okay for her to have a choice but not him?
— Sheetal Rijhwani (@rijhwanisheetal) November 21, 2026
అయితే అతని నిర్ణయాన్ని ఆ అమ్మాయి తీవ్రంగా తప్పుబట్టింది. తన వ్యక్తిగత నిర్ణయాలను నియంత్రించాలని చూస్తున్నాడని.. అతని ఆలోచనలు వెనుకబడినవని, మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. ఇరు కుటుంబాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా అబ్బాయి ఇంట్లోనూ అతనిపై అసంతృప్తి వ్యక్తమైంది. "అమ్మాయికి ఉద్యోగం చేయకూడదనే వ్యక్తిగత ఛాయిస్ ఉన్నప్పుడు, అబ్బాయికి ఉద్యోగం చేసే భార్య కావాలనే ఛాయిస్ ఎందుకు ఉండకూడదు?" అని శీతల్ ప్రశ్నించారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇద్దరూ సంపాదించడం ఎంతో అవసరమని.. తన అంచనాలకు తగ్గ భాగస్వామిని ఎంచుకునే హక్కు అబ్బాయికి ఉందని చాలామంది సమర్థించారు. అమ్మాయికి గృహిణిగా ఉండే హక్కు ఉన్నట్లే అబ్బాయికి కూడా తన ప్రాధాన్యతలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి మారుతున్న మ్యారేజ్ మార్కెట్లో ఆర్థిక స్వతంత్రం, వ్యక్తిగత ప్రాధాన్యతల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
