ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.140 కోట్లు లాభం!

ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.140 కోట్లు లాభం!

సీఈఓగా హువాంగ్ రీఎంట్రీతో ఎన్విడియా షేర్ల విలువ భారీగా పెరగడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగానే లాభపడ్డారు. తానే వెనకుండి బోర్డును ఒప్పించానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ తన స్వార్థం కోసమే ఇదంతా చేశారా అనే అనుమానాలు నెట్టింట వ్యక్తం అవుతున్నాయి. దీంతో ట్రంప్ పెట్టుబడుల విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు(రూ.140 కోట్లు) పెరిగింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపడుతున్నట్లు ప్రకటన రావటంతో స్టాక్ ఒకేరోజు 30 శాతం కంటే ఎక్కువ పెరిగి ట్రంప్ కి కాసుల వర్షం కురిపించింది.

సెప్టెంబర్ 30 నాటికి ట్రంప్ దగ్గర 3 లక్షల 70 వేల వరకు ఎన్విడియా షేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో ట్రంప్ ఏవైనా షేర్లను అమ్మారా లేదా కొత్తవి కొన్నారా అనే వివరాలు అందుబాటులో లేవు. సెప్టెంబర్ నాటి అంచనాల ప్రకారం ఆయన షేర్ల విలువ సోమవారం నాటి మార్కెట్ పెరుగుదలతో 1.3 మిలియన్ డాలర్ల నుంచి 15 మిలియన్ డాలర్ల వరకు పెరిగి ఉండవచ్చు.

జెన్సన్ హువాంగ్ ను తిరిగి తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ప్రకటించారు. 'నేనే ఆ డీల్ కుదిర్చాను, బోర్డు సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించాను' అని ట్రంప్ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఎన్విడియాకు హువాంగ్ నాయకత్వం అవసరమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు ట్రంప్. ఎన్విడియా బోర్డు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు హువాంగ్‌ను తిరిగి నియమించినట్లు తెలిపింది. ఆయన రాక వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని బోర్డు స్పష్టం చేసింది.

అయితే ఈ వ్యవహారంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. హువాంగ్ నియామకం గురించి అధికారిక ప్రకటన రాకముందే జరిగిన స్టాక్ లావాదేవీలపై దర్యాప్తు చేయాలని డెమోక్రటిక్ సెనేటర్ రూబెన్ గాలెగో డిమాండ్ చేశారు. ప్రకటనకు ముందు ఎవరు ఏయే పొజిషన్లలో షేర్లు కొన్నారో తేలాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందని ఆరోపించారు.

ALSO READ : నేనే కన్విన్స్ చేశా: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ కమ్ బ్యాక్పై ట్రంప్ !

హువాంగ్ గతంలో నవంబర్ 12న తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరించారు. సోమవారం శాంటా క్లారాలోని ప్రధాన కార్యాలయానికి వచ్చిన హువాంగ్ కు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. తనకు రెండో అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి మరింత మెరుగైన సీఈఓగా పని చేస్తానని హువాంగ్ హామీ ఇచ్చారు. బోర్డు ఆయనను ఏకగ్రీవంగా సీఈఓగా నియమిస్తూ వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించటంతో ఏఐ ప్రపంచంలో మళ్లీ రేసు స్పీడప్ అయ్యింది.

మరిన్ని వార్తలు