గతవారం చివరి వరకూ తగ్గుతూపోయిన బంగారం రేట్లు మళ్లీ పైపైకి దూసుకుపోతున్నాయి. దీంతో గడచిన రెండు రోజులుగా బ్రేక్ లేకుండా గోల్డ్ రేట్లు దూసుకుపోవటంతో రేట్లు తగ్గుతాయని వెయిట్ చేసిన కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్తీక పౌర్ణమి రోజున జ్యువెలరీ, వెండి వస్తువులు కొందాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ సమీప నగరాల్లో మారిన ధరలను పరిశీలించటం బెటర్.
హైదరాబాద్ లో 2026, నవంబర్ 24వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 27 వేల 800 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 17 వేల 150 రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 95 వేల 850 రూపాయలు
ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 75 వేల రూపాయలు
నవంబర్ 24న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 124 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 780గా కొనసాగుతోంది. మంగళవారం రోజున రూ.లక్షా 27 వేల 800కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 715గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 17 వేల 150 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
ALSO READ : కారు, బైక్ ఇన్సూరెన్స్ ఇక ఈజీ.. బీమా కోసం ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 24, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 75వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.175 దగ్గర ఉంది.
