- చార్జింగ్ కేంద్రాల్లో పేటీఎం పేమెంట్స్..చార్జ్జోన్తో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ పేమెంట్స్ కోసం పేటీఎం, చార్జ్జోన్ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా చార్జ్జోన్ నిర్వహించే 15 వేలకు పైగా హైస్పీడ్ ఈవీ చార్జింగ్ పాయింట్ల వద్ద పేటీఎం క్యూఆర్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. హైవేలు, నగరాలు, వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న 1,200కు పైగా చార్జింగ్ కేంద్రాల్లో ఈ సదుపాయం కల్పించనున్నారు. వాహనదారులు చార్జింగ్ కేంద్రం వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, డబ్బు చెల్లించవచ్చని పేటీఎం తెలిపింది.
