చెన్నై: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించడంతో తమిళనాట రాజకీయ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 24న దీపతూన్ వద్ద ఒక్కసారి దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించగా.. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పును సీపీఐ, సీపీఎంలు వ్యతిరేకించాయి.
ప్రభుత్వ న్యాయపరమైన చర్యలను సీఎం వివరించనున్నట్టు తెలుస్తోంది. అయితే, భేటీ అభివృద్ధి పనుల కోసమేనని, ఆలయ వివాదంపై చర్చ ఉండదని తమిళనాడు మంత్రి తెలిపారు. తిరుప్పరంకుండ్రం కొండపై ఆలయం, దర్గా మధ్య వందేళ్లుగా స్థల వివాదం కొనసాగుతోంది. 1996లో దర్గాకు 15 మీటర్ల దూరంలో దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతించింది. తర్వాత దీపతూన్ వద్ద వెలిగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
