- లైసెన్సులు సస్పెండ్ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
న్యూఢిల్లీ: ఆహార భద్రత నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 5 న్యూట్రాస్యూటికల్, ఆరోగ్య ఉత్పత్తుల తయారీ సంస్థల లైసెన్సులను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సస్పెండ్ చేసింది. వేదాంత్ రెమెడీస్, లూసిడ్ హెల్త్‌కేర్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, విటామెడిక్ హెల్త్ న్యూట్రాస్యూటికల్స్, అడోరియల్ హెల్త్‌కేర్ సంస్థలపై ఈ చర్య తీసుకుంది.
