నేనే కన్విన్స్ చేశా: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ కమ్ బ్యాక్పై ట్రంప్ !

నేనే కన్విన్స్ చేశా: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ కమ్ బ్యాక్పై ట్రంప్ !

ప్రపంచంలో ఎక్కడ ఏ రాజీ జరిగినా, సర్దుబాటు జరిగినా, శాంతి ఒప్పందాలు కుదిరినా క్రెడిట్ తీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొస్తున్నారు. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకంలో కూడా తానే ఎన్విడియా బోర్డు డైరెక్టర్లతో మాట్లాడి ఒప్పించినట్లు ట్రంప్ చెప్పారు. ఎన్విడియా బోర్డు డైరెక్టర్లతో మాట్లాడి, జెన్సన్ హువాంగ్ ను మళ్లీ సీఈఓగా నియమించేలా వారిని ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

హువాంగ్ వివాహేతర సంబంధాల వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డుకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు. చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళతో సహా పలువురు మహిళలతో హువాంగ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నవంబర్ 12న హువాంగ్ తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే.. హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారు.

హువాంగ్ పునర్నియామకంపై ఎన్విడియా సోమవారం ప్రకటన విడుదల చేయడానికి ముందు, ఆదివారం రాత్రి ఆయనతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. బోర్డు సభ్యులు అడిగిన జాతీయ భద్రత అంశంపై తమకు తెలిసిన సమాచారం మేరకు భరోసా ఇచ్చామని తెలిపారు. హువాంగ్ను కోల్పోవడమే అసలైన ముప్పు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత వారం హువాంగ్ రాజీనామా తర్వాత ఎన్విడియా షేర్లు పతనం కావడం తన నిర్ణయంపై ప్రభావం చూపిందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవుననే సమాధానం ఇచ్చారు. అయితే షేర్ల విలువ కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. హువాంగ్ మెదడులో ఎవరికీ తెలియని చిప్స్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.