హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ హుడా హైట్స్‌లో ప్లాట్ల విక్రయానికి HMDA ఈ-వేలం నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. HMDA నవంబర్ 25, 2026న ఈ-వేలం నిర్వహించనుంది. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో హుడా హైట్స్, హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 102/1, టీఎస్ నంబర్లు 5, 14లో ఉన్న ప్లాట్లు, బ్లాక్ J, వార్డు నంబర్ 12 పరిధిలో ఈ ప్లాట్లు వేలంలో వేయనున్నారు.
ప్లాట్ల కొనుగోలుకు పెట్టుబడిదారులు, బిల్డర్లు, వ్యాపారవేత్తలకు అవకాశం ఇస్తున్నట్లు HMDA పేర్కొంది. హుడా హైట్స్ వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అనుకూలమైన ప్రాంతంగా ఉంది. భవిష్యత్తులో భూముల విలువ పెరిగే అవకాశం ఉందని HMDA ప్రకటించింది. పారదర్శక ఈ-వేలం విధానంలో ప్లాట్ల విక్రయం ఉంటుందని HMDA స్పష్టం చేసింది.
