ఎన్విడియా అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్కే.. మళ్లీ సీఈఓ బాధ్యతలు !

ఎన్విడియా అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్కే.. మళ్లీ సీఈఓ బాధ్యతలు !

ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెంట్గా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారు. నవంబర్ 12న రాజీనామా చేసిన హువాంగ్ను బోర్డు ఏకగ్రీవంగా తిరిగి ఆహ్వానించింది. జాతీయ భద్రతకు ముప్పు లేదని అమెరికా ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే.. విదేశీ నిఘా సంస్థల ఆరోపణలపై హువాంగ్పై విచారణ కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

డిసెంబర్ 1, 2 తేదీల్లో అమెరికా హౌస్ కమిటీల ముందు హువాంగ్ విచారణకు హాజరుకానున్నారు. చైనా గూఢచారి సంస్థ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న ఓ మహిళతో హువాంగ్కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా అధికారులు అనుమానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కారణంగానే ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెంట్గా జెన్సన్ హువాంగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన రాజీనామా తర్వాత సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.

33 ఏళ్ల పాటు సీఈఓగా పనిచేసిన జెన్సన్ హువాంగ్ నవంబర్ 12న రాజీనామా చేశారు. విదేశీ నిఘా సంస్థల ప్రయత్నాలకు ఆయన లక్ష్యంగా మారారనే నివేదికలపై ఎన్విడియా విచారణ ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయన వైదొలిగారు. బోర్డు ఛైర్మన్ హార్వీ సీ జోన్స్ మాట్లాడుతూ.. ఎన్విడియాను నడిపించడానికి జెన్సన్ సరైన వ్యక్తి అని బోర్డు నమ్ముతోందని చెప్పారు. ఆయన పునరాగమనం వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ప్రయోజనాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. తాత్కాలిక సీఈఓగా పనిచేసిన కొలెట్ క్రెస్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓగా కొనసాగుతారు.

జెన్సన్ హువాంగ్ తన కమ్ బ్యా్క్పై స్పందిస్తూ.. ఎన్విడియాలోకి మళ్లీ రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్న ప్రపంచంలోని కీలక టెక్నాలజీ కంపెనీల్లో ఒకదానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యతల్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నానని ఆయన తెలిపారు.