నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు బిగ్ బాస్ హౌస్ లో ఊహించని అనుభవం ఎదురైంది. తన మూవీ ప్రమోషన్ కోసం వెళ్లిన ఆమెకు .. అక్కడ ఓ పాత పరిచయం బయటపడింది. పైగా ఆ పరిచయం కూడా మామూలుది కాదు.. కాలేజీ రోజుల కనెక్షన్.. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10 వేదికపై జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన అప్‌కమింగ్ మూవీ 'మైసా' ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఆదివారం ఎపిసోడ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లను పరిచయం చేస్తున్న నాగార్జున.. ముఖేష్ గౌడను పిలిచి, రష్మికతో మైసూరు కన్నడలోనో, బెంగళూరు కన్నడలోనో మాట్లాడొచ్చంటూ సరదాగా చెప్పారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతలో ముఖేష్ అసలు విషయం బయటపెట్టాడు.
రష్మిక తనకు కాలేజీ జూనియర్ అని ముఖేష్ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన స్నేహితులు రష్మికతో కలిసి చదువుకున్నారని, అప్పట్లో తాను కూడా ఆమెను చూశానని ముఖేష్ వెల్లడించాడు. దీంతో ఈ అనుకోని పరిచయాన్ని చూసి రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు.. 'గర్ల్‌ఫ్రెండ్' సినిమాలో తన నటనను ముఖేష్ ప్రశంసించడంతో సంతోషించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సినిమా 'మైసా' చూడాలని ముఖేష్ ని రష్మిక కోరారు.
ఇక ముఖేష్ గౌడ విషయానికొస్తే.. 'నిహార్ ముఖేష్'గా కూడా గుర్తింపు పొందిన ఆయన కన్నడ, తెలుగు టెలివిజన్ రంగాల్లో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషిగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంజినీరింగ్ చదివిన ముఖేష్.. నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు.
మరోవైపు రష్మిక నటిస్తున్న 'మైసా'' గిరిజన నేపథ్యంలోని యాక్షన్ డ్రామా. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించనుంది. అయితే నవంబర్ 27న విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ముఖేష్ టీమ్ కూడా ఈ కాలేజీ అనుబంధాన్ని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పంచుకుంది. మొత్తానికి ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రష్మికకు కాలేజీ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసే సర్‌ప్రైజ్ దొరకడం ఈ ఎపిసోడ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
