కృష్ణా జలాల్లో తెలంగాణకు 578 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( నవంబర్ 23 ) కేఆర్ఎంబీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో 578 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని.. ఒప్పందంలో ప్రతి ఏడాది మాట్లాడుకునే వెసలుబాటు ఉండేదని అన్నారు సీఎం రేవంత్.
కానీ.. 2020లో ఒకేసారి ఏపీకి 512 టీఎంసీల నీళ్లను తాకట్టు పెట్టారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడీ ఆపే శక్తి లేకపోతే.. తెలంగాణ వచ్చాక కూడా ఎందుకు అడ్డుకోలేదని అన్నారు సీఎం రేవంత్.సాగర్ కు సొరంగం తవ్విన పాపం కేసీఆర్ దే అని.. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని అన్నారు.
బీఆర్ఏస్ పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. మొదటి నుంచి కృష్ణా జలాల హక్కులను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని.. ఇందుకు సంబంధించి ఆధారాలను యవల బయటపెడుతున్నానని అన్నారు సీఎం రేవంత్.
తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడుతుంటే..బీఆర్ఎస్ పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తోందని అన్నారు సీఎం రేవంత్. పల్నాడు వాటర్ గ్రిడ్ ను మేము అడ్డుకోలేదని ప్రచారం చేస్తున్నారని.. జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై జీవో విడుదలైందని.. అప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారని అన్నారు సీఎం రేవంత్. రూ.12 వేల కోట్లతో పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలని అప్పట్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ అంశాన్ని వ్యతిరేకించలేదని అన్నారు సీఎం రేవంత్.
