శంషాబాద్ లో దారుణం జరిగింది. ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. సోమవారం ( నవంబర్ 23 ) హిమాయత్ సాగర్ ఎకో పార్క్ సమీపంలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... హిమాయత్ సాగర్ ఎకో పార్క్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ముర్తుజ పైల్వాన్ పై దాడి చేసి చంపేశారు.
కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు ముర్తుజ. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ముర్తుజను అత్తాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ముర్తుజా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు డాక్టర్లు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్యకు కారణం వ్యక్తిగత కక్షలా లేక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
