బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేచించి ఘాటు విమర్శలు చేశారు మంత్రి సీతక్క. సోమవారం ( నవంబర్ 23 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు సీతక్క. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు విమానాశ్రయం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు సీతక్క.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందని అన్నారు. కాళేశ్వరం నుంచి ములుగు జిల్లాకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదని... దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ నీటితోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని...ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసాపై కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని అన్నారు సీతక్క.
