ఎన్నికల్లోపు నీళ్లిస్తం..పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ సిద్ధం: మంత్రి ఉత్తమ్

ఎన్నికల్లోపు నీళ్లిస్తం..పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ సిద్ధం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లను అందిస్తామని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌‌‌‌చార్జ్ సందీప్‌‌తో భేటీ అయిన అనంతరం ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను పెండింగులో పెట్టిందని, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా,  నెట్టెంపాడు, డిండి, ఎస్‌‌‌‌ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు వారి హయాంలో పూర్తికాలేదన్నారు.

 ప్రజలకు, రైతాంగానికి మేలు జరిగేలా నిరంతరం పనిచేస్తున్నామని, సాగునీటి రంగం చరిత్రలో ఎన్నడూలేని విధంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ తమ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. గాంధీ భవన్ తో తనకు భావోద్వేగమైన బంధం అని, అది నాకు రెండో ఇల్లు వంటిదన్నారు. రెండోసారి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కొత్త ఇన్‌‌‌‌చార్జీ సందీప్ తో చర్చించామన్నారు.