రేపు (నవంబర్ 25న) హుడా హైట్స్ లో ప్రీమియం ప్లాట్ల ఈ- వేలం

రేపు (నవంబర్ 25న) హుడా హైట్స్ లో ప్రీమియం ప్లాట్ల ఈ- వేలం

హైదరాబాద్ సిటీ, వెలుగు:   బంజారాహిల్స్‌‌‌‌ సమీపంలోని హుడా హైట్స్‌‌‌‌లో ప్రీమియం ప్లాట్ల విక్రయానికి ఈ నెల 25న హెచ్‌‌‌‌ఎండీఏ ఈ- వేలం నిర్వహించనుంది. షేక్‌‌‌‌పేట మండలం హకీంపేట పరిధిలోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న ఈ లే అవుట్‌‌‌‌లోని ప్లాట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నట్లు హెచ్‌‌‌‌ఎండీఏ  కమిషనర్‌‌‌‌ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంజారాహిల్స్‌‌‌‌కు సమీపంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, వాణిజ్యపరమైన అభివృద్ధికి అవకాశాలు ఉండటంతో హుడా హైట్స్‌‌‌‌ ప్లాట్లు.. పెట్టుబడిదారులు, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ డెవలపర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలకు ఆకర్శిస్తోందని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండటంతో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా భావిస్తున్నారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వేలంలో పాల్గొనాలని హెచ్ఎండీఏ సూచించింది. ప్లాట్ల వివరాలు, అర్హతలు, నిబంధనలు, వేలంలో పాల్గొనే విధానం తదితర వివరాలను అధికారిక వేలం నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నామని స్పష్టం చేసింది.