ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనపెట్టి, కథను నమ్మి చేశా :శర్వానంద్

ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనపెట్టి, కథను నమ్మి చేశా :శర్వానంద్

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన  పీరియాడికల్  యాక్షన్ డ్రామా ‘భోగి’.  కె.కె.రాధామోహన్ నిర్మించారు. నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. తాజాగా  నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 1960వ దశకం నేపథ్యంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామంలో సాగే ఈ కథ మిస్టరీ, ఎమోషన్స్, రా యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సినిమాపై  ఆసక్తిని పెంచేలా ట్రైలర్ సాగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘ఈ మూవీ  ఫస్ట్ కాపీ చూసినప్పుడు  ఒక తెలియని  సంతృప్తి  కలిగింది.  

ఇందులో  నా పాత్రతో  అందరినీ కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నా.  ఎలాంటి లెక్కలు వేసుకోకుండా  ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనపెట్టి, కథను నమ్మి చేసిన సినిమా ఇది.  ‘తగ్గినోడికి తగలబెట్టడం కూడా తెలుసు. అనవసరంగా కెలకకండి.. తగలబెట్టి పడేస్తాడు’ అని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉన్న డైలాగే ఈ సినిమా కథాంశం’ అని చెప్పాడు. ఈ చిత్రంలో మందారం అనే వైవిధ్య పాత్రలో కనిపిస్తానని డింపుల్ హయతి చెప్పింది.  తెలంగాణలోని బొగ్గులకుంట గ్రామంలో జరిగిన కథ ఇదని,   ఇందులో శర్వానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతంలో ఎన్నడూ చూడని బీస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూస్తారని దర్శకుడు సంపత్ నంది అన్నాడు. శర్వా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని నిర్మాత రాధామోహన్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, లిరిసిస్ట్ చంద్రబోస్,  కొరియోగ్రాఫర్ భాను మాస్టర్,  డీఓపీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు.