ప్రైవేట్ స్కూల్లో మత ప్రచారం ఆరోపణలు..కాగజ్నగర్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు

ప్రైవేట్ స్కూల్లో మత ప్రచారం ఆరోపణలు..కాగజ్నగర్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నట్టు హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాగజ్​నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరికి సోమవారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చారిగాం రోడ్​లో ఉన్న స్కూల్​లో సెకండ్​ క్లాస్ చదువుతున్న ఓ స్టూడెంట్ నోట్ బుక్​లో బైబిల్ సూక్తులు రాసి చదవాలని స్కూల్ యాజమాన్యం బలవంతం చేసిందన్నారు.

ఆ స్టూడెంట్ ఈ విషయాన్ని పేరెంట్స్​కు చెప్పగా, మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వచ్చి స్కూల్ మేనేజ్​మెంట్​ను నిలదీశారు. వారితోనూ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో హిందూ సంఘాల నాయకులు కాగజ్​నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఎంఈవో ప్రభాకర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి స్కూల్​ గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ మత ప్రచారం ఆరోపణలపై ఎంక్వైరీ జరిపి నిజమని తేలితే స్కూల్ మేనేజ్​మెంట్​పై యాక్షన్​ తీసుకుంటామని హామీ ఇచ్చారు.